నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ
కిర్లంపూడి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు గురువారం సమావేశం కానున్నారు. ముద్రగడ నివాసంలో జరిగే ఈ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. తుని ఘటనలో కేసులు, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని, ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని 14 రోజుల దీక్ష విరమించిన అనంతరం బుధవారం ముద్రగడ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని, తనను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.