తలుపులు బద్దలు కొట్టి ముద్రగడ అరెస్ట్
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అరెస్ట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాపు నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంబులెన్స్ లో ఆయనను తరలించారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించారు. చంద్రబాబు సర్కారు స్పందిచకపోవడంతో ఆయన దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. ముద్రగడ నివాసంలోకి మీడియాను కూడా అనుమతించలేదు.