ముద్రగడ కొడుకును తరిమికొట్టిన పోలీసులు!
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నిరాహార దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా ఆయన కొడుకును పోలీసులు తరిమికొట్టారు. ఆయన తనయుడిపై పోలీసులు లాఠీ ఝళిపిస్తున్న తాజా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు.