ముద్రగడ పద్మనాభంతో సమావేశమైన కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు
గోకవరం: కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ పద్మనాభాన్ని సోమవారం కలిశారు. కాపు ఉద్యమాన్ని ఆయన సారథ్యంలోనే నడిపించాలని కోరారు.
వారి అభ్యర్థనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా జేఏసీ నాయకులకు తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ముద్రగడే తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే కాపు ఉద్యమం కొనసాగుతుందని, సమయాన్ని బట్టి ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తోట రాజీవ్, ఎన్.వెంకట్రాయుడు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment