kapu jac leaders
-
పవన్ రాజకీయం కోసం రంగా హత్యను వాడుకోవడం దుర్మార్గం : కాపు నాయకులు
-
కాపు ఉద్యమాన్ని మీరే నడిపించండి
గోకవరం: కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ పద్మనాభాన్ని సోమవారం కలిశారు. కాపు ఉద్యమాన్ని ఆయన సారథ్యంలోనే నడిపించాలని కోరారు. వారి అభ్యర్థనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా జేఏసీ నాయకులకు తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ముద్రగడే తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే కాపు ఉద్యమం కొనసాగుతుందని, సమయాన్ని బట్టి ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తోట రాజీవ్, ఎన్.వెంకట్రాయుడు తదితరులు ఉన్నారు. -
నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
-
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు. (చదవండి: కాపు ఉద్యమానికి ఇక సెలవ్) -
వైఎస్ జగన్ ప్రకటనపై కాపుల హర్షం
-
‘నా ముందు చంద్రబాబు బచ్చా’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ముందు ఓ బచ్చా అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని, మీరే దేశంలోనే సీనియర్ నేతను అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప.. రాష్ట్రానికి మీరు చేసింది ఏమైనా ఉందా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. కాపు జేఏసీ కార్యాచరణ సమావేశంలో బుధవారం ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీలతో ప్రధాని మీద నిరసన తెలుపుతూ ధర్నాలు, దీక్షలు చేపట్టాలని.. అంతేకానీ సామాన్య ప్రజలతో దీక్షలు చేపించడం సిగ్గుచేటన్నారు. గతంలో తనకు ఓటేయనుందుకు సిగ్గు పడాలన్నారు.. కానీ చంద్రబాబుకు ఓటేసినందుకు ఏపీ ప్రజలు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఊపిరి ఉన్నంత వరకూ టీడీపీని నమ్మవద్దని ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం దీక్షలు చేపట్టాలన్నా, శాంతి యుతంగా నిరసన తెలపాలన్నా ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా అణచివేసిందన్నారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనే ధర్నాలు చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్రం మీ ఎస్టేటా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూసి ఉండరని పేర్కొన్నారు. హామీని నెరవేర్చని సీఎంను అధ:పాతాళానికి తొక్కేయాలన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. చీకటి రాజకీయాలు చంద్రబాబుకు అలవాటేనన్నారు. చంద్రబాబును జీవితంలో క్షమించవద్దు. దళితులు, అణగారిన వర్గాలతో కలిసి జనపోరాటం చేయాలి. మనం ఏదైనా చేస్తే అనుమతి తీసుకోవాలంటున్నారు. మరి చంద్రబాబు సైకిల్ తొక్కడానికి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆందోళన చేయించడానికి ఏపీ సీఎం ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన పాపాలను ప్రజల మీద రుద్దుతున్నారని విమర్శించారు. -
ముద్రగడ దీక్ష కొనసాగుతుంది: కాపు జేఏసీ
కాపు రిజర్వేషన్ల సాధన కోసం, తుని ఘటనలో అరెస్టయిన వారిని విడిపించాలన్న లక్ష్యతో గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన దీక్షను కొనసాగిస్తారని కాపు జేఏసీ నేతలు తెలిపారు. ఆయన కేవలం తన రక్త నమూనాలు ఇచ్చేందుకు మాత్రమే అంగీకరించారని.. అంతేతప్ప ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుమతించలేదని చెప్పారు. కాగా, అంతకుముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. కాపునేతలతో చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నామని, ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఆకుల వ్యాఖ్యలను కాపు జేఏసీ నేతలు ఖండించినట్లయింది. ముద్రగడ పద్మనాభం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోడానికి అనుమతించలేదని కాపు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.