కిర్లంపూడి చేరుకున్న పోలీసు బలగాలు | police force at kirlampudi | Sakshi
Sakshi News home page

కిర్లంపూడి చేరుకున్న పోలీసు బలగాలు

Published Sat, Nov 12 2016 9:41 PM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM

police force at kirlampudi

కిర్లంపూడి : 
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16న రావులపాలెం నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో పోలీసు బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రకు ప్రభు త్వ అనుమతి లేదంటూ డీఐజీ ప్రకటించారు. పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని ముందస్తు బందోబస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను దించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విజయనగరం ఏపీఎస్పీ బెటాలియ¯ŒS నుంచి 150 మంది పోలీసులు శనివారం కిర్లంపూడి చేరుకున్నారు. ఇంకా మరిన్ని బలగాలను ఇక్కడకు దించే అవకాశం ఉందని తెలిసింది. 
జగ్గంపేటలో..
జగ్గంపేట : కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న కాపు సత్యాగ్రహయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తుని విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు తుని మాదిరిగా అధిక సంఖ్యలో కాపు కులస్తులు హాజరైతే ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీసులను ఇప్పటి నుంచే తరలిస్తున్నారు. జగ్గంపేట సర్కిల్‌ స్టేష¯ŒSకు శనివారం భారీగా పోలీసులు తరలివచ్చారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌సై స్థాయి అధికారులతో పాటు హెచ్‌సీలు, పీసీలు, హోమ్‌గార్డులు ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి సుమారు 150 మంది సిబ్బంది వచ్చారని, వీరిని స్థానికంగా ఉంచుతున్నట్టు ఎస్‌సై అలీఖా¯ŒS తెలిపారు. వీరికి సీఐ కాశీ విశ్వనాథం పలు సూచనలు ఇచ్చారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement