పట్టుకున్న గంజాయిని చూపిస్తున్న డీఎస్పీ
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్టిన నిఘా సత్ఫలితాలనిస్తోంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు కిర్లంపూడి మండలం క్రిష్ణవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,419 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.1.30 కోట్లు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్‌పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం చెప్పారు.
ముందస్తు సమాచారంతో కిర్లంపూడి ఎస్‌ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి వెలుగు చూసింది. ఒక కారు, లారీలో మొక్కజొన్న బస్తాల మధ్యన 66 మూటలలో 1,419 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకుని విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు, మహారాష్ట్రకు చెందిన చొప్పడి ప్రతాప్‌లను అరెస్ట్ చేశారు. జయశ్వాల్, కరణం రవీంద్రబాబు, రాంబాబు అనే వ్యక్తులు పరారైనట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎడిషనల్ ఎస్పీ, ఎస్‌ఈబీ డీఎస్పీ అంబికాప్రసాద్, జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, కిర్లంపూడి ఎస్‌ఐ తిరుపతిరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment