cannabis case
-
మొక్కజొన్న మూటల్లో గంజాయి రవాణా
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్టిన నిఘా సత్ఫలితాలనిస్తోంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు కిర్లంపూడి మండలం క్రిష్ణవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,419 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.30 కోట్లు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం చెప్పారు. ముందస్తు సమాచారంతో కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి వెలుగు చూసింది. ఒక కారు, లారీలో మొక్కజొన్న బస్తాల మధ్యన 66 మూటలలో 1,419 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకుని విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు, మహారాష్ట్రకు చెందిన చొప్పడి ప్రతాప్‌లను అరెస్ట్ చేశారు. జయశ్వాల్, కరణం రవీంద్రబాబు, రాంబాబు అనే వ్యక్తులు పరారైనట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎడిషనల్ ఎస్పీ, ఎస్ఈబీ డీఎస్పీ అంబికాప్రసాద్, జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. -
కాటేస్తున్న కాల్ రికార్డ్
సాక్షి, పెద్దపల్లి/ముత్తారం: గంజాయి కుట్ర కేసులో మరో అరెస్ట్ చోటుచేసుకొంది. ఓడేడుకు చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు భానుకుమార్‌ను శుక్రవారం హైద్రాబాద్ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గంజాయి కుట్రవ్యవహారంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడిని కూడా అరెస్ట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్కే చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి కూడా రేపో, మాపో అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. వీరంతా కిషన్‌రెడ్డితో విభేదాలున్న వాళ్లు కావడం విశేషం. కదులుతున్న డొంక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంజాయి కుట్ర కేసు తీగ లాగితే డొంక కదులుతుంది. ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అ««ధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డిని గంజాయి కేసులో ఇరికించాలని మాజీ సర్పంచ్ భర్త సుదర్శన్ కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. కేసులో సుదర్శన్, ఇల్లెందుల భార్గవ్‌తో పాటు సహకరించారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సుదర్శన్, భార్గవ్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాయకుల్లో వణుకు గంజాయి కుట్ర కేసులో వాయిస్ కాల్‌రికార్డులు కీలకంగా మారాయి. సుదర్శన్ ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నేరుగా అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. దీనితో సుదర్శన్‌తో కిషన్‌రెడ్డి వ్యవహారం మాట్లాడిన నాయకులంతా ఏక్షణాన ఏంజరుగుతుందోననే భయాందోళనలో ఉన్నారు. సుదర్శన్ ఫోన్రికార్డ్స్ల ఆధారంగానే మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై కేసునమోదు చేయగా, అవే రికార్డ్స్ అధారంగా మరిన్ని అరెస్ట్‌లకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై కుట్రపన్నిన కేసులో సుదర్శన్అరెస్ట్ కాగా, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు వెలుగు చూడడం తాజాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కిషన్‌రెడ్డితో వైరం ఉన్న నాయకుల్లోని చాలా మందితో సుదర్శన్ ఈ కుట్రకేసు చర్చించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్‌రికార్డ్స్ ఆధారంగా టీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. కిషన్‌రెడ్డి, భానుకుమార్‌ల మధ్య విభేదాలు ఉండడంతో సహజంగానే సుదర్శన్, భానులు తరుచుగా మాట్లాడుకొనే వారు. ఈ క్రమంలో గంజాయి కుట్ర కేసుకు సంబంధించి కూడా భానుకుమార్ సుదర్శన్‌తో మాట్లాడిన సంభాషణల రికార్డులు పోలీసులకు లభించినట్లు తెలిసింది. సుదర్శన్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా ఎప్పుడు, ఎవరని పోలీసులు అదుపులోకి తీసుకుంటారో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. కొంతమంది నాయకులు ఇప్పటికే రహస్య ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. అయితే సుదర్శన్ ఫోన్ రికార్డ్‌ల్లో మండలానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి ఒకరి సంభాషణ కూడా ఉన్నట్లు సమాచారం. సదరు అధికార పార్టీ నాయకునికి, కిషన్‌రెడ్డికి మధ్య కుడా విబేధాలు ఉండడంతో సుదర్శన్‌ను అధికారపార్టీ నాయకుడు ఫోన్లో సంప్రదింపులు చేసేవాడని తెలిసింది. పలుకేసుల గురించి సుదర్శన్‌తో ఆనాయకుడు చర్చించిన రికార్డు పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. అధికారపారీ నాయకులే సొంత పార్టీ నాయకునిపై గంజాయి కుట్రకేసుకు సహకరించారని తెలిసిన మండల ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు. ఒకరు ఇంటికి...మరొకరు స్టేషన్‌కు గంజాయి కుట్ర కేసులో మూడవ ముద్దాయి, ఓడేడ్‌కు చెందిన ఇల్లెందుల భార్గవ్‌కు గురువారం బెయిల్ మంజూరు కాగా, శుక్రవారం తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు దేవునూరి భానుకుమార్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఒకరు బయటకు రావడం, మరొకరు లోపలికి పోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆటకట్టు
మరిపెడ, న్యూస్‌లైన్ : ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన నకిలీ పోలీసులను మరిపెడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి నిందితుల వివరాలు వెల్లడించారు. మరిపెడకు చెందిన మచ్చర్ల లింగయ్య, మచ్చర్ల లక్ష్మణ్, మమబూబాబాద్ మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు మురళి, నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన జి. కుమార్‌తో అదే జిల్లా ఆత్మకూరు మండలం దుంపెల్లి గ్రామానికి చెందిన మారోజు రత్నాచారి ముఠాను ఏర్పాటు చేశాడు. వీరిలో లింగయ్య లాండ్రీషాపు నడుపుతుండగా మిగతావారు ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా కురవి మండలం మాదాపురానికి చెందిన భూక్య శ్రీను కొంతకాలంగా హైదరాబాద్‌లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమం లో అతడు నాలుగు రోజుల క్రితం గంజారుు విక్రరుుస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిపై హైదరాబాద్‌లో గంజాయి కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఉన్న పరిచయంతో వారి ద్వారా విష యం తెలుసుకున్న రత్నాచారి నిందితుడి కుటుంబం నుంచి డబ్బులు రాబట్టేందుకు పథక రచన చేశాడు. లింగయ్య, లక్ష్మణ్, మురళి, కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోనే కారు అద్దెకు తీసుకుని గురువారం రాత్రి మాదాపురం చేరుకున్నాడు. తాము టాస్క్ ఫోర్స పోలీసులమని నీ భర్తను కేసు నుంచి విడిపిస్తామని శ్రీను భార్యతో నమ్మబలికి ఆమె వద్ద బంగారు చెవిదిద్దులు, కాళ్ల వెండిపట్టీలు తీసుకున్నారు. అదే తండాకు చెందిన ఆంగోతు రాములుతో కూడా నీపై గతంలో ఉన్న కేసులను ఎత్తివేయిస్తామని చెప్పడంతో ఆయన నమ్మలేదు. అయినా బలవంతంగా కారులో ఎక్కించుకుని నల్లగొండ జిల్లా భువనగిరికి తీసుకెళ్లారు. ఎంత బెదిరించినా అతడు తనవద్ద ఒక్కపైసా కూడా లేదని చెప్పడంతో చేయిచేసుకున్నారు. చివరికి రూ.80 వేలు ఇస్తానని తేల్చిచెప్పడంతో అతడిని కొట్టడం ఆపేశారు. అనంతరం భువనగిరి నుంచి సూర్యాపేటకు తీసుకొచ్చారు. రాములు తన అల్లుడైన మరిపెడ మండలం ఉల్లెపల్లి శివారు భూక్యతండాకు చెందిన రామ్మూర్తికి అక్కడి నుంచి ఫోన్ చేసి నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఇచ్చాడు. తన మామ రాములును వదిలిపెట్టడానికి ముందు రూ.50 వేలు ఇస్తానని రామ్మూర్తి అంగీకరించాడు. డబ్బులు తీసుకునేందుకు మండలంలోని ఎల్లంపేట స్టేజీ వద్దకు రావాలని చెప్పి, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. శుక్రవారం మధ్యాహ్నం కారు లో నకిలీలు స్టేజీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే మాటువేసి ఉన్న కానిస్టేబుళ్లు రమేష్, రాజు వారిని అనుమానించి లింగయ్య, చారిని పట్టుకోగా మిగతావారు పరారయ్యారు. దొరికిన విచారించి హైదరాబాద్‌లో ఉన్న మురళి, లక్ష్మణ్‌ను కూడా అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్ట్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఆమె అభినందించారు. కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య, నర్సింహుల పేట ఎస్సై వై. వెంకటప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్,రాజు, కరుణాకర్, వీరరాఘవులు పాల్గొన్నారు.