ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్‌ | Break again to mudragada chalo amaravati padayatra | Sakshi
Sakshi News home page

ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్‌

Published Sat, Aug 5 2017 1:03 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్‌ - Sakshi

ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్‌

ప్రత్తిపాడు: చట్టం చంద్రబాబుకు చుట్టంలా మారిందని, తమకు మాత్రం సెక్షన్‌ 30, 144 కేసులా? అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాను రోజూ పాదయాత్రకు బయలుదేరతానని చెప్పిన మేరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రను అడ్డుకోవడంతో ఆయన నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు పెట్టినపుడు బెంజి సర్కిల్‌లో రోజుల తరబడి ట్రాఫిక్‌ మళ్లించేస్తారని, తన పాదయాత్రకు మాత్రం అనుమతినివ్వడంలేదని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ముద్రగడ కాసేపటికి అనుచరులతో కలిసి గేటు వద్దకు వచ్చి కంచాలపై దరువు వేస్తూ నిరసన తెలిపారు. మళ్లీ శనివారం పాదయాత్రకు బయలుదేరతానని ముద్రగడ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement