ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు ఆదివారం మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 6వ రోజైన ఆదివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని పోలీసలు మద్రగడను అడ్డుకున్నారు.
ముద్రగడ, కాపు జేఏసీ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం కూడా ఆయన పాదయాత్రను అడ్డుకున్నారు. ఎన్నిరోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి అని ముద్రగడ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.