కిర్లంపూడిలో మళ్లీ ఉద్రికత్త నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు.. కిర్లంపూడిలో బలగాలు మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది.