
ముద్రగడ ఇంటికి తాళం
కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం నుంచి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడికి పోలీసులు తరలించారు. అయితే పోలీసు వ్యాన్ దిగేందుకు ఆయన నిరాకరించారు.
తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చేసే వరకు పోలీస్ వ్యాన్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ముద్రగడ అనుచరులు ఆయన ఇంటి గేట్లు మూసివేసి తాళాలు వేశారు. ఆయనకు మద్దతుగా కాపులు భారీగా కిర్లంపూడికి చేరుకుంటున్నారు.
కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో భారీగా పోలీసులను మొహరించారు. అన్ని దుకాణాలు మూసేశారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.