సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి | Mudragada open letter to the Kapu caste people | Sakshi
Sakshi News home page

సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి

Published Tue, Feb 14 2017 12:43 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి - Sakshi

సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి

కాపు కులస్తులకు ముద్రగడ బహిరంగ లేఖ

కిర్లంపూడి: ఈనెల 26న చేపట్టనున్న కాపు సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాపు సత్యాగ్రహ దీక్ష చేయాలని సూచించారు.

కాపు కులస్తులందరూ దీక్షలో పాల్గొనాలన్నారు. ఇతర కుల సోదరుల మద్దతు కూడా కోరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే దీక్షలో తాను పాల్గొంటానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement