Kapu Satyagraha deeksha
-
కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే'
-
'కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే'
కర్నూలు : కాపులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం మధ్యాహ్నం ఆయన కాపు సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని, ఎవరు అడ్డుకున్నా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ముద్రగడ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కాపు నేతలు, కార్యకర్తలు సత్యాగ్రహదీక్షలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపులకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. -
'బాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారు'
-
'బాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారు'
కాకినాడ : కాపు ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఆయన 'సాక్షి' తో మాట్లాడుతూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నామన్నారు. కర్నూలులో నిర్వహించే కాపు సత్యాగ్రహ దీక్షలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. బాబు వైఖరిని కాపు జాతంతా గమనిస్తోందన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చినట్లే యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంగా ఉందన్నారు. యువతకు ఉపాధిలేకపోతే చెడుమార్గంలోకి వెళ్లే అవకాశముందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చడం ఆయన స్థాయికి తగదన్నారు. హోదా కోసం అందరూ ఓ గొడుగు కిందకు వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలకూ హోదాకోసం ఇప్పటికే లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మార్చి 26న కాకినాడలో కాపు న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. -
సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి
కాపు కులస్తులకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి: ఈనెల 26న చేపట్టనున్న కాపు సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాపు సత్యాగ్రహ దీక్ష చేయాలని సూచించారు. కాపు కులస్తులందరూ దీక్షలో పాల్గొనాలన్నారు. ఇతర కుల సోదరుల మద్దతు కూడా కోరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే దీక్షలో తాను పాల్గొంటానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.