
'కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే'
కర్నూలు : కాపులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం మధ్యాహ్నం ఆయన కాపు సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని, ఎవరు అడ్డుకున్నా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ముద్రగడ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కాపు నేతలు, కార్యకర్తలు సత్యాగ్రహదీక్షలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపులకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.