ఎవ్వరిపైనా లేని విధంగా కాపు జాతిపై ఆంక్షలా | Mudragada placed under house arrest | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 25 2017 6:48 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యాత్ర చేయడానికి అవకాశం లేకుండా పోలీ సులు ఆయన్ను ముందుగానే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వే షన్లు కల్పించాలని కోరుతూ మలి విడత ఉద్య మంలో భాగంగా ముద్రగడ కాపు సత్యాగ్రహ పేరిట బుధవారం నుంచి పాదయాత్ర తల పెట్టడం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అమలాపురం వరకు ఐదు రోజులపాటు పాదయాత్రకు ఆయన సంకల్పించారు. పాదయాత్రలో పాల్గొనేం దుకు మంగళవారం సాయంత్రం ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసం నుంచి రావుల పాలెం బయలుదేరగా ఇంటిగేటు వద్దనే పోలీ సులు అడ్డుకున్నారు. జిల్లాలో 144వ సెక్షన్, సెక్షన్‌ 30 అమల్లో ఉన్నాయని, పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 151సీ ప్రకారం హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పడంతో ముద్రగడ వెనుదిరిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement