
ముద్రగడ ఇంటి వద్ద జర్నలిస్టుల ధర్నా
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లోని కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసులు చర్యకు నిరసనగా గురువారం ఉదయం ముద్రగడ నివాసం వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు.
తుని సంఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ తన ఇంటిలోనే దీక్షను ప్రారంభించారు.ఈ నేపధ్యంలో మీడియా ప్రతినిధులను ముద్రగడ ఇంటిలోకి పోలీసులు అనుమతించలేదు. కిర్లంపూడి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎర్రవరం-కిర్లంపూడి, పత్తిపాడు-కిర్లంపూడు రహదారులను మూసివేశారు. పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేశారు.