
ముద్రగడ మంచికే జరిగింది: ఉండవల్లి
కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరాన్ని పాకిస్థాన్ బోర్డర్లా చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. దీనివల్ల కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మంచే జరిగిందని అన్నారు. దీక్ష సమయంలో ముద్రగడకు టీవీ, ఫోన్, పేపర్ లేకుండా చేశారని చెప్పారు.
మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రడగ పద్మనాభం నివాసానికి చేరుకున్న ఉండవల్లి ముద్రగడను పరామర్శించారు. అనంతరం ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఉండవల్లి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబును హిట్లర్, ముసోలినితో ఉండవల్లి పోల్చారు. హిట్లర్, ముసోలిని ఉద్యమకారులను అణిచి నిర్వీర్యం చేశారని అన్నారు. చంద్రబాబు కూడా ముద్రగడను మానసికంగా బలహీనపర్చేందుకే 13 రోజుల పాటు ఆస్పత్రిలో నిర్భందించారని ఉండవల్లి తెలిపారు.