కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు.
కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను వెల్లడించారు. ఆయనకు వయసు దృష్ట్యా షుగర్ తగ్గుతోందని, ఇంకా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విశాఖ నుంచి, రాజమండ్రి నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తారని అన్నారు. మొదటి రోజు కాబట్టి ఇప్పటికి కీటోన్ బాడీస్ రాలేదని, రేపటికి కనిపించే ప్రమాదం ఉందని చెప్పారు. వివరాలు..
బీపీ 160/100
పల్స్ 82
షుగర్ 178
బరువు 86 కిలోలు