indefinate hunger strike
-
'ముద్రగడ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి'
కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను వెల్లడించారు. ఆయనకు వయసు దృష్ట్యా షుగర్ తగ్గుతోందని, ఇంకా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విశాఖ నుంచి, రాజమండ్రి నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తారని అన్నారు. మొదటి రోజు కాబట్టి ఇప్పటికి కీటోన్ బాడీస్ రాలేదని, రేపటికి కనిపించే ప్రమాదం ఉందని చెప్పారు. వివరాలు.. బీపీ 160/100 పల్స్ 82 షుగర్ 178 బరువు 86 కిలోలు -
12 గంటలు దాటిన ముద్రగడ ఆమరణ దీక్ష
కిర్లంపూడి: కాపులను బీసీల జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 12గంటలు దాటింది. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. కాపులతో పాటు ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడి వైపు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవి చేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
ఇక్కడికి రావద్దు.. ఇబ్బందులు పడొద్దు
- కాపు రిజర్వేషన్ల కోసం కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరశన - దీక్షా స్థలికి రావద్దంటూ అభిమానులకు పద్మనాభం పిలుపు - తూర్పుగోదావరి జిల్లా అంతటా 144 సెక్షన్.. భారీగా మోహరించిన బలగాలు కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. స్వగ్రామం కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడివైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవిచేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇతరులెవరికీ జిల్లాలోకి ప్రవేశం లేదని ఎస్సీ ప్రకటించారు. దీక్ష ప్రారంభానికి కొద్ది సేపటి ముందు ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కాపు జాతి కోసం చేస్తోన్న న్యాయమైన దీక్షకు మద్దతు పలకాలని మీడియా ద్వారా ముద్రగడ ప్రజలకు విన్నవించుకున్నారు. తాను ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని కాపులు ఎక్కడికక్కడే నిరసన తెలియజేయాలని, మధ్యాహ్న భోజనం మానేసి సీఎంకు వినిపించేలా కంచాలపై గరిటెలతో చప్పుడుచేయాలని ఆయన కోరారు. 'నాకు మద్దతు పలికేందుకు సోదరులెవరూ ఇక్కడికి(కిర్లంపూడికి) రావద్దు. మన పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు బ్యాడ్ ఎలిమెంట్స్(దుష్టశక్తులు) ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడికొచ్చి, వాటి చేతుల్లోపడి ఇబ్బందులు పడొద్దు'అని ముద్రగడ తోటి కాపులకు మనవిచేశారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, ఒంటరిగానైనాసరే దీక్ష చేపడతానని శుక్రవారం ఉదయం తన ఇంటికి వచ్చిన పోలీసులకు పద్మనాభం స్పష్టం చేశారు. జాతికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆపబోనని, శాంతియుతంగానే నిరసశన కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన.. అసాంఘిక శక్తుల ప్రభావానికి లోనుకావద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. -
విద్యార్థుల ఆమరణ దీక్ష
- రోహిత్ ఆత్మహత్య కారకులు వైదొలగాలనే డిమాండ్ తో దీక్షకు దిగిన ఎనిమిది మంది విద్యార్థులు - నేడు హెచ్ సీయూకు కేజ్రీవాల్, మాయవతి, సురవరం సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. మరోవైపు వరుసగా నాలుగోరోజు కూడా సెంట్రల్ వర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివే సే దాకా పోరు కొనసాగుతుందని వర్సిటీ సామాజిక న్యాయ సాధన జేఏసీ ప్రకటించింది. రోహిత్ దళితుడేనని రుజువు చేసే ఎస్సీ సర్టిఫికెట్‌ను విద్యార్థులు విడుదల చేశారు. మరోవైపు ‘వెలివాడ’ వద్ద ప్రత్యేక సమాచార విభాగాన్ని (ఇన్ఫర్మేషన్ డెస్క్) ఏర్పాటు చేశారు. వర్సిటీలో గతేడాది ఆగస్టులో మొదలైన వివాదం నుంచి, కమిటీల నివేదికలు, కేంద్రమంత్రుల లేఖలు, విద్యార్థుల బహిష్కరణ, రోహిత్ సూసైడ్ నోట్, తదితర 21 రకాల పత్రాలను అందులో అందుబాటులో ఉంచారు. నేడు కేజ్రీవాల్, మాయవతి, సురవరం రాక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం హెచ్సీయూకు రానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా హెచ్‌సీయూను సందర్శించనున్నారు. న్యాయం జరిగే వరకు దీక్ష.. ‘‘దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికినా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు. మతతత్వ వైఖరితోనే దళిత, వామపక్ష విద్యార్థి సంఘాలపై ఎన్డీఏ ప్రభుత్వం, దాని అనుబంధ విభాగాలైన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మ మ్మల్ని వర్సిటీ నుంచి వెలివేశారు. వీసీ బీజే పీ తొత్తుగా ఉన్నారు. ఆత్మహత్యతో సంబం దం ఉన్న వారందరూ పదవుల నుంచి వైదొలగాలి. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగే వరకు మా దీక్ష కొనసాగుతుంది’’ - బహిష్కరణకు గురైన పరిశోధక విద్యార్థులు శేషన్న, విజయ్, ప్రశాంత్, సుంకన్న