కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించతలపెట్టిన పాదయాత్రను అడ్డుకుని ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. దీంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా పలు జిల్లాల కాపు నాయకులు, అభిమానులు కిర్లంపూడికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ముద్రగడ ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరగుతోంది. భారీగా మహిళలు, కాపు నాయకులు, అభిమానులు కిర్లంపూడి తరలివస్తున్నారు.
నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి జేఏసీ నాయకుడు మలకల చంటిబాబు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లపై భారీ ర్యాలీగా తరలివచ్చి కిర్లంపూడి మండలం రాజుపాలెం సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో చేసి ముఖ్యమంత్రి చంద్రబాబకు వ్యతిరేకంగా, ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేసి పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలంటూ నల్లజెండాలతో నిరసన తెలియజేశారు.
రాజుపాలెం గ్రామానికి చెందిన కాపు నాయకుడు గణేశుల రాంబాబు, లక్ష్మణరావుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కాపులు అధిక సంఖ్యలో మహిళలు రాజుపాలెం నుంచి కిర్లంపూడి ముద్రగడ ఇంటి వరకు పాదయాత్రగా తరలివచ్చారు. అలాగే ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నుంచి తానా నూకరాజునాయుడు, జువ్వల చినబాబు, కొల్లి కొండబాబు, చక్కపల్లి సత్తిబాబుల ఆధ్వర్యంలో కిర్లంపూడి వచ్చి స్థానిక ఎస్సీపేట వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి 50 కార్లపై కాపు నాయకులు ర్యాలీగా తరలివచ్చి ముద్రగడ పాదయాత్రకు తమ సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దాపురం నియోజకవర్గం కాపు సంఘం గౌరవాధ్యక్షుడు దవులూరి సుబ్బారావు, సామర్లకోట కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల పెదబాబు, కాపు నాయకులు వర్రే రవి, సురేష్, పెద్దాపురం టౌన్ జేఏసీ కన్వీనర్ జిగిని రాజబాబు తదితరులతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులు బొల్లి చిట్టిబాబు, చల్లా సత్తిబాబు, సిద్ధా అప్పలరాజు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే నిడదవోలు, తాడేపల్లిగూడెం, పిఠాపురం, జిల్లాలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కాపు నాయకులు, మహిళలు తరలివచ్చారు.
కిర్లంపూడి జనసంద్రం
Published Mon, Aug 21 2017 2:49 AM | Last Updated on Tue, Sep 12 2017 12:36 AM
Advertisement