
సాక్షి, కాకినాడ: తన భవిష్యత్ రాజకీయ నిర్ణయం త్వరలో ప్రకటిస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు రాసిన మూడు పేజీల బహిరంగ లేఖను కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాకు విడుదల చేశారు. 2016 జనవరి 31న తునిలో కాపుగర్జన సభ జరిగిన మరునాడు తనను తీహార్ జైలుకు తీసుకెళ్లటానికి హెలికాప్టర్ సిద్ధంగా పెట్టారని, వెంటనే బెయిల్ తెచ్చుకోవాలని.. లేదంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవాలని పలువురు సలహా ఇచ్చారని గుర్తు చేశారు.
అప్పట్లో అలా చేసి ఉంటే కులంతో పాటు ఉద్యమం కూడా చులకనయ్యేదని ముద్రగడ అన్నారు. తుని సమావేశంలో ఎక్కువగా భయపడింది, బాధపడింది తనతో ఉన్న సామాన్యుల కోసమేనని పేర్కొన్నారు. అందుకే.. సభకు వచి్చన వారిని బాధ పెట్టొద్దని, సభ పెట్టడానికి తానే కారకుడనని, అన్ని కేసులు తనపై పెట్టుకోవాలని ఆనాడే ప్రభుత్వానికి చెప్పానన్నారు. ఈ కేసులో ఉరిశిక్ష వేసినా పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లకూడదని నిశ్చయించుకున్నానని తెలిపారు.
‘ప్రత్తిపాడు రాజకీయ భిక్ష పెట్టింది’
ప్రత్తిపాడు నియోజకవర్గం తనకు రాజకీయ భిక్ష పెట్టిందని, తన తాత పద్మనాభం మున్సబుగా, తండ్రి వీరరాఘవరావు స్వతంత్ర ఎమ్మెల్యేగా తమ కుటుంబానికి విలువ తెచ్చారని ముద్రగడ పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉంటూ ఎవరికీ అన్యాయం చేయకూడదని వారు చెప్పారని, తన ఊపిరి ఉన్నంత కాలం ఆ మాటలు గుర్తుంటాయన్నారు. వారి బాటలో నడిచే తాను జాతిని అమ్మకం, తాకట్టు పెట్టలేదన్నారు. ఉద్యమాలు, రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదన్నారు.
కాపు జాతి రిజర్వేషన్ల కోసం ప్రయతి్నంచి జోకర్ కార్డు మాదిరిగా అయినందుకు బాధపడుతున్నానని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, గౌతు స్వామి, గణేశుల రాంబాబు తదితరులు ఉన్నారు.
చదవండి: బిల్డప్ బాబూ బిల్డప్..! ఆ విషయం చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా?
Comments
Please login to add a commentAdd a comment