- 12 డ్రోన్లతో చిత్రీకరణ
- 16న రావులపాలేనికి కాపులు రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు
- 8 వజ్ర వాహనాలు, వాటర్, గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో సన్నద్ధం
- 13 జిల్లాల నుంచి ఆరు వేల మంది పోలీసుల మోహరింపు
- కోనసీమ చరిత్రలో తొలిసారిగా అత్యాధునిక భారీ బందోబస్తు
కాపుల యాత్రపై పోలీసుల డేగ కన్ను
Published Mon, Nov 14 2016 11:57 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
అమలాపురం టౌన్ : కాపు సత్యగ్రహ పాదయాత్రపై పోలీసులు డేగ కన్ను వేస్తున్నారు. కాపుల పాద యాత్రను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ముఖ్య ప్రదేశాల్లో 12 డ్రోన్లు సిద్ధం చేశారు. వీటిలో రావులపాలెంలో రెండు, అమలాపురంలో రెండు ఉండేలా...మిగిలిన ఎనిమిది కొత్తపేట, రాజోలు, మలికిపురం, తాటిపాక, అయినవిల్లి, అంతర్వేది తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. శాటిలైట్...చిప్ ఆధారంగా పనిచేసే వీటి కోసం అమలాపురం పోలీసులు 12 ఫో¯ŒS నంబర్లతో కొత్త సిమ్‌లు సిద్ధం చేశారు. ఇప్పటికే రాయలసీమ, కోస్తా, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి దాదాపు మూడు వేల మందికి పైగా పోలీసులను కోనసీమకు తరలించారు. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో మూడు వేల మంది పోలీసులను బరిలోకి దింపుతున్నారు. వీరిలో సీఆర్‌పీఎఫ్, ఏఎ¯ŒSఎస్ తదితర స్పెషల్ ఫోర్సులు కూడా ఉన్నాయి. డీఐజీ, ఎస్పీతోపాటు నలుగురు ఏఏస్పీలు, 25 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు, 500 మంది ఎస్‌సైలను పాదయాత్ర బందోబస్తు విధుల్లో భాగస్వామ్యులను చేస్తున్నారు.
అత్యాధునిక వాహనాలు సిద్ధం...
కాపుల పాద యాత్రను అడ్డుకునే సమయంలో ఆందోళనకారులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ అత్యాధునిక వాహనాలను రంగంలోకి దింపింది. ఎంత జన సమూహాన్నైనా అదుపు చేసేందుకు ఎనిమిది వజ్ర వాహనాలను రప్పించారు. మల్టీ ప్రొటెక్ష¯ŒSతో ఉండే ఈ వాహనంలో వాటర్ కే¯Œ్స, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు వంటివి ఉంటాయి. ముళ్ల కంచెల రోల్స్, రైట్ గేర్ కిట్స్ అంటే బుల్లెట్ ప్రూఫ్, స్టో¯Œ్స ప్రూఫ్ జాకెట్లు కూడా సిద్ధం చేశా>రు. ఎలాంటి వాహనాలనైనా చిటికెలో ఛేజ్ చేసే 4 రాఫిడ్ ఇంటర్వెష¯Œ్స వెహికల్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటే వారిని తక్షణమే అక్కడి నుంచి తరలించేందుకు కేంపర్స్ వాహనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ యాత్రకు ముందు..వెనుక ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా రావులపాలేనికి రెండు వేల మంది...అమలాపురానికి రెండు వేల మంది...యాత్ర సాగే ముఖ్య ప్రాంతాల్లో రెండు వేల మంది పోలీసులను ప్రస్తుతానికి సర్ధుబాటు చేశారు. ఈ యాత్రకు బందోబస్తుపరంగా ప్రత్యేక అధికారిగా నియమితులైన అడిషనల్ ఎస్పీ ఏఎస్ దామోదర్ నాలుగు రోజులుగా కోనసీమలోనే మకాం చేసి బందోబస్తు ప్యూహాలను రూపాందిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యే రావులపాలేనికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులు రాకుండా పోలీసు చెక్ పోస్టులలో నిలువరించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
చెక్‌పోస్టులు ఏర్పాటు..
జొన్నాడ వంతెనలపైనే కాకుండా రావులపాలం వచ్చేందకు అంతర్గత రోడ్లలో పోలీసు చెక్ పోస్ట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే దిండి– చించునాడ వంతెన, బోడసకుర్‌ుర– పాశర్లపూడి వంతెన, యానాం–ఎదుర్లంక వంతెనతోపాటు సఖినేటిపల్లి, కోటిపల్లి ఫెర్?రల వద్ద కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
ముద్రగడ పాదయాత్ర విజయవంతానికి పూజలు
కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు నిర్వహించనున్న పాదయాత్ర జయప్రదం కావాలని కిర్లంపూడి శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి అభిషేకాలు జరిపారు. కాళ్ల సత్యనారాయణ, సరకణం భద్రం, కరణం వెంకటేశ్వరరావు, గంధం నల్లయ్య, దొంగబాబు అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు.
Advertisement