మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగే కాపు ఐక్య గర్జన మహాసభకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపు నిచ్చారు.
గుంటూరు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభకు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపు నిచ్చారు. ఆదివారం అంబటి గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.
కాపులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు సర్కార్ మర్చిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో అక్రమ మైనింగ్ జరుగుతోందని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌ను అధికారులు పట్టించుకోవడం లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు.