తుని(తూ.గో): త్వరలో జిల్లాలో జరిగే కాపునాడు సదస్సను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు. తునిలో జరిగే కాపునాడు సదస్సుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం పలువురు కాపునాడు నాయకులు జ్యోతుల నెహ్రును కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాపునాడు ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దుతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.