
కాపుగాసిన నాయకుడు
మిరియాల వెంకటరావు అనగానే ఈయన కాపు నాయకుడు అంటారు కొందరు. కొం దరైతే కాపు గాసిన మా నాయకుడు మిరియాల అంటారు. కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి.
మిరియాల వెంకటరావు అనగానే ఈయన కాపు నాయకుడు అంటారు కొందరు. కొం దరైతే కాపు గాసిన మా నాయకుడు మిరియాల అంటారు. కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగునాట ఎందరో కుల నాయకులున్నా పర కుల ద్వేషంతో కాక స్వకుల మిత్రత్వంతో మన స్సులు గెలివాలి అభివృద్ధి చెందాలి అని చెప్పిన విభిన్న నాయకుడు ఈయన. ఆయన ఇల్లు అన్ని కులాల, అన్ని వర్గాలవారి రాకతో నిత్యం కోలాహలంగా ఉండేది. దళిత, బీసీ నేతలు, విద్యార్థి నాయకులు ఇలా అందరూ సలహాలు, సూచనల కోసం ఆయన్ని కలిసేవారు.
1939, డిసెంబర్ 25న రాజమండ్రిలో వెం కటరావు జన్మించారు. పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందినా, ఆయన జీవితంలో అధిక భాగం విజయవాడతోనే ముడిపడింది. విద్యార్థి దశనుంచే సామ్యవాద భావాలను కలిగి, ప్రతి సామాజిక అంశాన్ని విశ్లేషించుకుని భవిష్యత్ ను నిర్మించుకున్నారు. తరువాత అదే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపింది. ట్రేడ్ యూని యన్ నాయకుణ్ణి చేసింది. రిక్షా కార్మిక సంఘం మొదలుకుని ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల వరకు ఆయన నాయకత్వంలో పని చేశాయి. జక్కం పూడి, ఉండవల్లి, గొల్లపల్లి సూర్యారావు, హర్ష కుమార్ వంటి నాయకులు ఆయన అనుచరులుగా ఉన్నారు. ఇక జై ఆం ధ్రా ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద జైలుక్కూడా వెళ్లారు. ఒక ఉద్యమ నేతగా సమస్యలు ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం అన్నది స్వయంగా, అనుభవ పూర్వకంగా ఆయన నేర్చుకున్నారు.
సాహిత్య, నాటక, కళారంగాలంటే ఎన లేని అభిమానం. అలనాటి అందాల నాయ కుడు హరనాథ్, ఏడిద నాగేశ్వరరావులు వెంక టరావుతో చాలా సన్నిహితంగా మెలిగే వారు. రావుగోపాలరావు, నూతన్‌ప్రసాద్, నాటక కృష్ణుడు గుమ్మడి గోపాలకృష్ణలతో బాల్యం నుంచి సాన్నిహిత్యం ఉంది. వివిధ రంగాల వారితో ఆయనకున్న స్నేహం భవిష్యత్‌లో వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సమ తుల్యతకు దోహదపడింది. బీసీ, దళితనేతలు తరచుగా ఆయన్ని కలిసేవారు. 1988లో జరి గిన కాపునాడు సభ తన ఉద్యమాలకు స్ఫూర్తి అని మంద కృష్ణ అన్న సందర్భాలు ఎన్నో.
దీర్ఘకాలంగా దోపిడీకి గురవుతున్న కాపు కుల ప్రతినిధిగా ఆలోచనలు మొదల య్యాక, జనాభాలో 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారంలో 2 శాతం కూడా దక్కడంలేదని గ్రహించారు. ఆలోచనలు చిగురించాక కాపు మహా సభను 1982లో ప్రారంభించారు. తక్కువ జనాభా కలిగిన కులాల వారు ఎక్కువ జనాభా ఉన్న కాపు లను అణగదొక్కడాన్ని మిరియాల సహించలేక పోయారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు యాత్ర చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులందరినీ సమీ కరించారు. అందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చారు. కృష్ణానదీ తీరంలో లక్షలాది మంది కాపులతో జరిపిన కాపునాడు మహాసభ తెలు గునాట ప్రభుత్వాలనే మార్చేసింది.
అదే ఏడా దిలో జరిగిన వంగవీటి రంగ హత్యోదంతం కాపుల రక్తాన్ని మరిగించింది. కాపులు చాచి కొట్టిన దెబ్బకు అప్పటి ప్రభుత్వం చావు దెబ్బ తింది. ఈ ఉద్యమం అంతిమలక్ష్యం రాజ్యాధి కారమే అన్న భావన కాపుల్లో నింపడంలో మిరి యాల వెంకటరావు విజయం సాధించారు. ఆ విత్తనమే చెట్టయి నేటి ప్రభుత్వంలో కాపు స్థానాన్ని పదిలపర్చిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కాపుల అక్షరాస్యత తగినంతగా లేదన్న విష యం ఆయన్ని ఎప్పుడూ బాధించేది. కుల పెద్ద లతో అనేక వందల మందికి స్కాలర్‌షిప్‌లు ఇప్పించేవారు.
చదువులకు ఆర్థికసాయం చేసే లా ప్రోత్సహించేవారు. అనేక కల్యాణ మండ పాలు వీరి నేతృత్వంలో రూపుదిద్దుకున్నాయి. కార్తీక వన సమారాధనల నిర్వహణతో వెనుక బడిన కులాల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించారు. కాపు ప్రజాప్రతినిధులకు సన్మాన సభలను ఏర్పాటుచేసి, మీ వెనుక మేమున్నామని వారిలో ధైర్యాన్ని నింపారు. కోరి వచ్చిన పదవులను తోసిపుచ్చారు. పాలక వర్గాల కుట్రలతో కాపు ఉద్యమం తన కళ్లముం దే కాంక్షల సంఘాలుగా విడిపోతుంటే మౌనం గా చూస్తుండిపోయారు. అనారోగ్యంతో ఇం టికే పరిమితమైనా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆపత్కాలంలో సూచనలిస్తూ చివరివరకు కాపు కులం కోసం పనిచేసిన మార్గ దర్శకుడాయన. కాపుల సుదీర్ఘ చరిత్రలో మిరి యాల వెంకటరావు కాపు ఉద్యమం ఓ ప్రత్యేక అధ్యాయం. ఓ సువర్ణ అధ్యాయం.
- పండలనేని గాయత్రి ఫ్రీలాన్స్ జర్నలిస్టు