'ఉద్యమాన్ని అణిచేందుకే పవన్ తెరపైకి'
హైదరాబాద్: కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకే జననేత అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై స్పందించని పవన్ ఇంతకాలం ఏంచేశారని ఆయన ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పవన్కు తెలియదా అని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్.. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వలేదని అన్నారు. కాంగ్రెస్ను తిట్టినా, కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినా ఊరుకోమని వీహెచ్ హెచ్చరించారు.