దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి | Mudragada in Kapu JAC Conference | Sakshi
Sakshi News home page

దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

Published Wed, Dec 7 2016 2:32 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM

దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి - Sakshi

దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

కాపు జేఏసీ సమావేశంలో ముద్రగడ

 కిర్లంపూడి: ఈ నెల 18 నుంచి జనవరి 25 వరకు నిర్వహించ తలపెట్టిన దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాపు నేతలకు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో 13 జిల్లాల జేఏసీ నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించారు.

18న నల్ల రిబ్బన్లు ధరించి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు కంచాలపై శబ్ధం చేస్తూ ఆకలి కేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 30న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు అందించాలన్నారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, జనవరి 25న యథాతథంగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement