Request Forms
-
హద్దులు లేక అన్యాక్రాంతం నగరంలో కానరాని చెరువులు
యథేచ్ఛగా ఆక్రమణలు చెరువుల భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు అధికారుల పాత్రపై అనుమానాలు గ్రేటర్ పరి«ధిలోని పలు చెరువులకు హద్దులు పెట్టకపోవడంతో అవి ఆక్రమణకు గురవుతున్నాయి. జలాశయాలను పరిరక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, చెరువుల రక్షణ సొసైటీలు జిల్లా యంత్రాంగానికి ఎన్ని వినతి పత్రాలు ఇస్తున్నా స్పందన కరువైంది. వరంగల్: గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి ఇబ్బందిగా మారడంతో గ్రామాల్లోని కూలీలు నగరానికి వలస వస్తున్నారు. ఇలాంటి వారు నివాసముండేందుకు ప్రభుత్వ స్థలాలే దిక్కయ్యాయి. వీటితో పాటు చెరువుల శిఖం భూముల్లో వీరు తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, వారి ముసుగులో రియల్టర్లు చెరువుల భూములను చెరపడుతున్నారు. ఒకనాటి రామసముద్రం నేడు ఎస్ఆర్ నగర్‌గా మారింది. కాలనీ వాసులు మౌలిక వసతుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి సైతం ఆక్రమణకు గురైంది. దీనిపై స్థానికులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకపోవడంపై అధికారుల పాత్రపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెరువులు ప్రశ్నార్థకమే... గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్లుగా, మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్న కొన్ని చెరువులు మినహాయిస్తే మిగిలిన చెరువులు కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేట, హస¯Œపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హన్మకొండలోని న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల చెరువు, బంధం చెరువు, భట్టుపల్లి కోట చెరువు, తిమ్మాపూర్ బెస్తం చెరువు, మడికొండ లోయకుంట, అయో«ధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు, పురిగిద్దు చెరువు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఎనుమాములలోని సాయి చెరువు, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పులలోని పెద్ద చెరువు, ఉంగల చెరువు, మాలకుంటలు ఉన్నాయి. వరంగల్ మండలం పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట చెరువు, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, బీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది. అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు చెప్పలేకపోతున్నారు. హద్దులు తేల్చని రెవెన్యూ శాఖ... నగరంలోని చెరువులు మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వాటి విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను రెవెన్యూ శాఖ నిర్ధారించాల్సి ఉంది. విస్తీర్ణం ఎంత ఉందో అన్నది రెవెన్యూ శాఖ గుర్తించి హద్దులు నిర్ణయిస్తే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారించాల్సి ఉంటుంది. ఇరు శాఖల్లో సమన్వయం లేకపోవడంతో చెరువుల భూములు ఆక్రమణకు గురువుతున్నాయి. ఈ చెరువుల పరిధిలో పట్టా భూములు ఉన్నాయని, హద్దులు గుర్తిస్తే తమ భూముల్లో హద్దులు పెట్టుకుంటామని భూహక్కుదారులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సంప్రదిస్తున్నా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల ఎఫ్టీఎల్ ఏమేరకు విస్తరించి ఉన్నది...విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను ప్రయివేటు ఏజెన్సీలతో సర్వే చేసి నిర్ణయిస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కరుణ ప్రకటించినా నేటి వరకు ఎలాంటి సర్వేలూ చేపట్టలేదు. నిలిచిన ‘బతుకమ్మ’ గద్దె నిర్మాణ పనులు చిన్నవడ్డేపల్లి చెరువులో ప్రతి ఏటా బతుకమ్మ ఆడేందుకు స్థలాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో కేటాయించారు. ఈ స్థలంలో గద్దె నిర్మించి బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రారంభమైన పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం పనులు జరుగుతున్న స్థలంతో పాటు సుమారు నాలుగున్నర ఎకరాల భూమిపై కోర్టు తీర్పు ఇచ్చిందని స్థల యాజమాని చెప్పడంతో బతుకమ్మ గద్దె పనులు నిలిచిపోయాయి. అసలు చెరువు ఎఫ్టీఎల్ ఎంత వరకు విస్తరించి ఉన్నది. అందులో ప్రభుత్వ భూమి ఏమేరకు ఉన్న విషయాలను గుర్తించి హద్దులు పెట్టాలని చెరువుల పరిరక్షణ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. -
దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
కాపు జేఏసీ సమావేశంలో ముద్రగడ కిర్లంపూడి: ఈ నెల 18 నుంచి జనవరి 25 వరకు నిర్వహించ తలపెట్టిన దశలవారీ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాపు నేతలకు మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో 13 జిల్లాల జేఏసీ నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించారు. 18న నల్ల రిబ్బన్లు ధరించి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు కంచాలపై శబ్ధం చేస్తూ ఆకలి కేక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 30న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు అందించాలన్నారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని, జనవరి 25న యథాతథంగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. -
అర్హతను బట్టి ఉద్యోగాలు
సాక్షి, సిటీబ్యూరో: వివిధ శాఖల్లో వికలాంగుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల మేరకు ఆయా ఉద్యోగాల్లో నియమిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజలనుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మైనార్టీ కార్పోరేషన్ ద్వారా గత వారమే 367 మందికి రూ.2 లక్షల రుణానికి సంబంధించి లబ్ధిదారులను చేశామన్నారు. రూ.లక్ష లోపు రుణాలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంకా రెండు నెలలు వేచి ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బస్తీల వారిగా సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధ్వర్యంలో త్వరలో తేదీలు ఖరారు చేస్తామని, అప్పుడే దరఖాస్తు చేయాలని సూచించారు. ► బంధువుల కిరాణం షాపులో పని చేస్తుండగా బాలనేరస్తుడని అపోహపడి తన కుమారుడు దేవేందర్‌ను పోలీసులు తీసుకెళ్లారని ఆగాపురాకు చెందిన శ్యామ్ భవాన్ కలెక్టర్‌ను కోరారు. తన కుమారుడిన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేయగా, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► ఆసీఫ్‌నగర్‌కు చెందిన గీత తాను 2005లో ఇంటి కోసం రూ.1000 చెల్లించానని, ఇప్పటి వరకు ఇల్లు రాలేదని వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ డబ్బు చెల్లించిన వారు జిల్లాలో 35 వేల మంది ఉన్నారని, వారందరి జాబితాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వానికి పంపామన్నారు. తుది నిర్ణయం వెలువడే వరకు ఓపిక పట్టాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆ రైతు కుటుంబాలను నిలబెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు మళ్లీ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మహిళా రైతులు, శ్రామికుల హక్కుల వేదిక (మకాం) డిమాండ్ చేసింది. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన మహిళలను రైతులుగా గుర్తించాలని, వారు వ్యవసాయం కొనసాగించడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరింది. మహిళా రైతులను ఆదుకునేందుకు వారి పేరిట పట్టాలు, రుణాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. శుక్రవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మకాం ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభం-మహిళా రైతులు, శ్రామికులపై పడుతున్న ప్రభావం-మనమేం చేద్దాం?’’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు స్వరాజ్య వేదిక సభ్యురాలు గోపరాజు సుధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోప్రొ.రమా మెల్కొటే, మకాం ప్రతినిధులు ఉషా సీతాలక్ష్మి, విజయ రుక్మిణిరావు, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. మకాం పక్షాన గ్రామాలకు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని, మహిళా రైతు లు, గ్రామాల్లో సంప్రదాయ వ్యవసాయ పరిరక్షణకు చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. వ్యవసాయంలో మహిళల పాత్రను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను బాధిత రైతు కుటుంబాల మహిళలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమా మెల్కొటే మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం సమగ్రమైన విధానం రూపొందించాలన్నారు. సాగును మరిచిపోయి కేవలం పాశ్చాత్య దేశాల్లోని అభివృద్ధిని అనుసరించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడకపోవడం వల్లే సంక్షోభం తలెత్తుతోందని ఉషా సీతాలక్ష్మి అన్నారు. రైతుల కోసం విరాళాలు సేకరిస్తున్నవారిలో.. రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశం కాకుండా, వారి ద్వారా ఏం ప్రయోజనం పొందుదామనే ధోరణే కనిపిస్తోందని కె.సజయ అన్నారు. మహిళా రైతులకు గుర్తింపు, ఇతరత్రా సమస్యలపై పాదయాత్ర నిర్వహించాలని ప్రముఖ రచయిత్రి విమల సూచించారు. -
కుంభకోణాలపై దర్యాప్తు చేయండి
హోంమంత్రి, ఆర్థికమంత్రికి వైఎస్సార్సీపీ బృందం వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. జగన్ వెంట పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీలు పి.వి. మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్‌పై, అవినీతి వ్యవహారాలపై వినతిపత్రాలు సమర్పించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాట్ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి రూ. 5.5 కోట్లు దాటరాదన్నది అందరికీ తెలిసిందే. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఒక మెగావాటుకు రూ. 8 కోట్ల వరకు అనుమతించారు. ఒకవైపు స్టీలు ధర మెట్రిక్ టన్నుకు రూ. 60 వేల నుంచి రూ. 40 వేలకు తగ్గింది. అయినా చంద్రబాబునాయుడు ఒక్క సివిల్ పనుల వ్యయాన్నే రూ.2,300 కోట్ల మేర అదనంగా అనుమతించారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఒక మెగావాట్‌కు రూ. 6 కోట్లు దాటింది. బాబుకు బినామీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్టీపీపీకి చెందిన కాంట్రాక్టర్లందరూ బలవంతంగా తప్పుకునే పరిస్థితి తెచ్చారు. ఆ తరువాత ధరలు సమీక్షించి సీఎం రమేశ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 22 శాతం ఎక్సెస్ చేసిన వారికి టెండర్లు కట్టబెట్టారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా జీవో నెంబర్-22 జారీ చేశారు. భారీగా ముడుపులు అందుకుని అదనపు మద్యం ఉత్పత్తి చేసేందుకు ఎంపిక చేసిన డిస్టలరీలకు అనుమతులిచ్చారు. తమకు అనుకూలమైన పరిశ్రమలకు అడగకుండానే రాయితీలు ఇచ్చారు. వైఎస్సార్ జిల్లాలోని బెరైటీస్ బేసిక్ ధరను తగ్గించి ఖజానాకు భారీ నష్టం కలిగించారు.