రాజమండ్రిలో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): తాను ఐఏఎస్‌గా పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని తిరుపతి ఎంపీ వరప్రసాద్ పోలీసులపై మండిపడ్డారు. ఆదివారం ఆయనను రాజమండ్రిలో పోలీసులు అడ్డుకున్నారు. కాపుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి వెళ్లారు. పోలీసులు ఆయనను చూసేందుకు అనుమతి నిరాకరించడంతో వెనుదిరిగారు.
రాజమండ్రిలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎంపీ వరప్రసాద్‌కు తెలిపారు. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను ఐఏఎస్ పనిచేశానని, తానెప్పుడూ ఇటువంటి పరిపాలన చూడలేదని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ తాము నలుగురురైదుగురు కలిసి గుమిగూడ కూడటం లేదు కదా అన్నారు. అనుమతి నిరాకరించడంతో ఎంపీ వరప్రసాద్ వెనుదిరిగారు.