తూర్పు గోదావరి: రేపటి (సోమవారం) నుంచి విజయవాడ-విశాఖపట్నం 'రత్నాచల్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కనున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలకు ఆహుతి అయిన సంగతి తెలిసిందే.
గత ఆదివారం తుని మండలం వెలమ కొత్తూరు సమీపంలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఆందోళనకారులు ఈ రైలును తగులబెట్టారు. ఈ ఘటనతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్పటి నుంచి విజయవాడ నుంచి విశాఖకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.
రేపటి నుంచి పట్టాలెక్కనున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
Published Sun, Feb 7 2016 5:10 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement
Advertisement