‘కాపులను బీసీల్లో చేర్చుకోవడానికి వ్యతిరేకం’ | we do not accept kapu's enter into bc's list, says r.krishnaiah | Sakshi
Sakshi News home page

‘కాపులను బీసీల్లో చేర్చుకోవడానికి వ్యతిరేకం’

Published Wed, Jan 1 2014 2:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

we do not accept kapu's enter into bc's list, says r.krishnaiah

సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు ఆ వర్గం ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించిన ఈ ప్రతిపాదనను బీసీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదన ఎట్టిపరిస్థితుల్లో తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.


 బీసీ సంక్షేమ సంఘంలోకి శ్రీరాముల శ్రీనివాస్: మావోయిస్టు మాజీ నేత శ్రీరాముల శ్రీనివాస్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో చేరారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కృషిచేయాలని తాను బీసీ సంక్షేమ సంఘంలో చేరుతున్నట్లు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement