రాజకీయ పార్టీలు బీసీలకు తక్షణమే డిక్లరేషన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు బీసీలకు తక్షణమే డిక్లరేషన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్‌లో జరిగిన 22 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. రాజకీయ పార్టీలకు ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్నా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణలో 60 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాలను, సీమాంధ్రలో 90 అసెంబ్లీ, 13 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలని కోరారు.