కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం | chandra babu calls emergency meeting | Sakshi
Sakshi News home page

కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం

Published Sun, Jan 31 2016 6:38 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం - Sakshi

కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు భేటీకానున్నారు.

తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాపు గర్జన తీవ్ర రూపం దాలుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పంపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement