tuni meeting
-
రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడే..
సాక్షి, నెట్వర్క్: కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో విశాఖ మార్గంలో వెళ్లే రైళ్లు, బస్సులకు ఎక్కడికక్కడ బ్రేక్‌లు పడ్డాయి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటనతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే విభాగం.. ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విశాఖ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి విశాఖ, కాకినాడ వైపునకు వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని మార్గమధ్యంలోనే నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిలిచిన రైళ్ల వివరాలు..: విశాఖ నుంచి బయల్దేరే విశాఖ-కాకినాడ, విశాఖ-రాజమండ్రి, విశాఖ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో, విశాఖ సికింద్రాబాద్ గరీబ్థ్,్ర విశాఖ-విజయవాడ ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. విశాఖ మీదుగా వెళ్లే విశాఖ-తిరుపతి తిరుమలను తునిలో నిలిపేశారు. భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి) ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ జిల్లా గుల్లిపాడులోను, హౌరా-చెన్నై మెయిల్‌ను నర్సీపట్నం రోడ్డులోనూ, గుంటూరు-విశాఖ(సింహాద్రి) ఎక్స్‌ప్రెస్‌ను హంసవరంలో నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ను పిఠాపురం వద్ద నిలిపేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట స్టేషన్ వరకే పరిమితమైంది. హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ పెద్ద అవుతపల్లి స్టేషన్లో నిలిచిపోయింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను కొవ్వూరులో, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏలూరులో, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను తాడేపల్లిగూడెంలో నిలిపేశారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు సిటీ రైలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ మార్గంలో వెళ్లే 15 రైళ్లను విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో నిలిపేసినట్లు రైల్వే డీఆర్ఎం అశోక్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఘటన ఉదంతం దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి విశాఖ,కాకినాడ వైపునకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆదివారం అప్పటికప్పుడు రద్దు చేశారు. రైళ్ల రద్దు సంగతి తెలియకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు చేరుకొన్న ప్రయాణికులు చివరి క్షణంలో రైళ్లు రద్దయినట్లు తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు సమాచారమిచ్చేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. విశాఖ: 8500358230, 8106053051, 0891-2575083, విజయవాడ: 0866-2575038, రాజమండ్రి: 0883-2420451, 0883-2420543, తుని: 08854-252172 కదలని బస్సులు..: మరోవైపు విశాఖ నుంచి తుని మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, నర్సాపూర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 175 బస్సులను రద్దు చేశారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 10 బస్సులను విజయవాడలోనే నిలిపివేశారు. -
తుని ఘటన: విజయవాడలో 144 సెక్షన్
విజయవాడ/తుని: తునిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే విజయవాడలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మంగళగిరి నుంచి అదనపు బలగాలు చేరుకున్నట్టు సమాచారం. అయితే కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
'దాడులు చేస్తున్నా.. సంయమనం పాటిస్తున్నారు'
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు సంయమనం పాటిస్తున్నారని ఆయన అన్నారు. తునిలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నామని డీజీపీ రాముడు వెల్లడించారు. -
కాసేపట్లో చంద్రబాబు అత్యవసర సమావేశం
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. కాసేపట్లో విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు భేటీకానున్నారు. తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాపు గర్జన తీవ్ర రూపం దాలుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పంపిస్తున్నారు. -
తునిలో ఉద్రిక్తత; రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు
తుని: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తుని రైల్వే స్టేషన్లో ఆగిపోయిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. బోగీలన్ని మంటల్లో కాలిపోయాయి. అంతకుముందు రాళ్లు రువ్వడంతో ఇంజిన్ ధ్వంసమైంది. ఆదివారం తునిలో ప్రారంభమైన కాపుగర్జనలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాస్తా, రైల్ రోకోలకు పిలుపునివ్వడంతో కోల్‌కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విజయవాడ-విశాఖపట్నం మధ్య రైళ్లు ఆగిపోయాయి. -
ఉద్యమరూపం దాల్చిన కాపుగర్జన
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ముద్రగడ చెప్పారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఈ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చే విషయాన్ని విస్మరించారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తున్నట్టు జీవో ఇచ్చే వరకు రైలు పట్టాలు, రోడ్లపై నుంచి వెళ్లేదిలేదని ముద్రగడ స్పష్టం చేశారు.