కాపులకు చినరాజప్పే సీఎం
పవన్ వల్లే టీడీపీకి అధికారం
కాపునాడు సభలో నేతలు
ఏలూరు: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం అండలేకుండా ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రాలేదని.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అయినా.. కాపులకు మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి అని కాపుసంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ నరసింహరావు అన్నారు. ఏలూరు నగర కాపునాడు ఆధ్వర్యంలో కాపు సామాజిక మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆదివారం సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో నరసింహరావు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా వీలైనంత త్వరగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సినీనటుడు పవన్‌కళ్యాణ్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏడాదిన్నరలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపులు పనిచేయకముందే రిజర్వేషన్లు ప్రకటించాలని పాలకొల్లు మునిసిపల్ చైర్మన్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పదవి కాపుగా ఉన్నందుకే వచ్చిందని, కులం కారణంగానే ఈ పదవిలో ఉన్నానని చిన రాజప్ప చెప్పారు.