
నేడే కాపు ఐక్య గర్జన
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం నిర్వహించనున్న కాపు ఐక్య గర్జన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యూరుు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరగనున్న ఈ భారీ సభకు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, ఒంటరి సామాజిక వర్గీయులు, ప్రముఖులు సుమారు పది లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. వి.కొత్తూరు వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పక్కనే ఉన్న 110 ఎకరాల సువిశాల కొబ్బరితోటలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభమవుతుంది.
జాతీయ రహదారికి అభిముఖంగా ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. సాంస్కతిక కళారూపాల కోసం మరో ప్రత్యేక వేదిక తయారైంది. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ముద్రగడ పద్మనాభం ఒక్కరే ఎక్కువ సేపు మాట్లాడతారని భావిస్తున్నారు. వాహనాలకోసం 11 చోట్ల 160 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. తిరుగుప్రయాణంలో ఇబ్బంది లేకుండా మూడు లక్షల మందికి భోజనం అందిస్తారు. ప్రాథమిక వైద్యసేవలకోసం మూడు బృందాలను ఏర్పా టు చేశారు. మందులను, రెండు అంబులెన్సులను ఉంచుతున్నారు.