సడలని దీక్ష
కొనసాగుతున్న కాపునేత ముద్రగడ దీక్ష..
సాక్షిప్రతినిధి, కాకినాడ/ రాజమహేంద్రవరం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కొనసాగుతోంది. చంద్రబాబు సర్కార్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తుని కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న ఘటనల్లో అక్రమంగా అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయక తప్పింది కాదు. అయితే మంగళవారం సాయంత్రం విడుదలైన కాపు జేఏసీ నేతలు ముద్రగడను కలిసేందుకు పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన 13 మంది కాపు నేతలు విడుదలై తన వద్దకు వచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తానని జేఏసీ నేతలతో విశాఖ డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలు జరిపిన చర్చల సందర్భంగా ముద్రగడ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దానికి వారు కూడా అంగీకరించారు. ఆ మేరకు సీఐడీ అరెస్ట్ చేసిన 13 మందిలో 10 మందికి బెయిల్ శనివారం లభించింది.
కానీ వారిలో ఎనిమిది మంది విడుదలవగా, మిగిలిన ఇద్దరు కూరాకుల పుల్లయ్య, లగుడు శ్రీనివాస్ సోమవారం రాత్రి, మిగిలిన ముగ్గురు కాపు నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసుకు సోమవారం బెయిల్ మంజూరైనా మంగళవారం రాత్రి విడుదలయ్యూరు. వారు ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి ఆస్పత్రికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. చర్చల సందర్భంగా ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చడం తగదని జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగినా ఫలితం లేకుండాపోరుుంది. దీంతో ముద్రగడ వద్దకు పంపేవరకూ తాము కదలబోమని వారు జైలు వద్దే బైఠారుుంచారు. ముద్రగడ ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తోందని జేఏసీ నేతలు మండిపడ్డారు. జైలు వద్ద వారు విలేకర్లతో మాట్లాడుతూ.. చర్చల సమయం లో ఒకలా ఇప్పడు మరోలా మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేందుకు యత్నిం స్తోందని విమర్శించారు. తాము వెళ్లేవరకూ దీక్ష విరమించనని ముద్రగడ చెప్పిన విష యం, అందుకు ప్రభుత్వం అంగీకారం అన్ని పత్రికల్లో వచ్చిందని గుర్తు చేశారు. ముద్రగడ ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వారు మండిపడ్డారు.