13 జిల్లాల్లోనూ పాదయాత్రలు
కాపు ఉద్యమనేత ముద్రగడ వెల్లడి
అమలాపురం టౌన్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో దశల వారీగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పాదయాత్రలు నిర్వహిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ముందస్తు కార్యాచరణ ప్రకారం ఈ నెల 18 నుంచి దశల వారీ పోరాటాలు చేస్తూ 2017 జనవరి 25 న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అమలాపురంలోని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహంలో శుక్రవారం కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా పవన్‌కుమార్, మిండగుదటి మోహన్, ఆర్వీ సుబ్బారావులతో కలిసి ముద్రగడ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.