నగరంలోని రాజ్భవన్లో శనివారం కాపు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్: నగరంలోని రాజ్భవన్లో శనివారం కాపు న్యాయవాదులు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తోందంటూ గవర్నర్ నరసింహన్కు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. కాపు యువకులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.
కాపుల భావప్రకటనా స్వేచ్ఛను పోలీసులు హరిస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హక్కులు కాపాడాలని గవర్నర్కు కాపు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది.