
అంబేడ్కర్ విగ్రహం వద్ద ముద్రగడ
కిర్లంపూడి (జగ్గంపేట): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను దళితవాడలకే పరిమితం చేయరాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి ఏనుగు వీధి సెంటర్ కాపుల వీధిలో ముద్రగడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని.. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాపుల వీధుల్లో అంబేడ్కర్ విగ్రహాలను పెట్టే ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ను ఒక్క కులానికే ఆపాదించకుండా అందరివాడిగా చూడాలన్నదే తన కోరికన్నారు.