
ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా: ముద్రగడ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. చర్చల అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. తన దీక్షను యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
మా జాతి కోసం పోరాడతా' అంటూ ముద్రగడ స్పష్టం చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరిన సంగతి తెలిసిందే.