రాష్ట్రానికి రాహుకేతువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి రావెల కిషోర్‌బాబులు దాపురించారని.....
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు
పట్నంబజారు:- రాష్ట్రానికి రాహుకేతువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి రావెల కిషోర్‌బాబులు దాపురించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు, చవాకులు పేలుతున్న మంత్రి రావెలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గుణపాఠం చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రావెలే పెద్ద శనీశ్వరుడన్న విషయాన్ని ఆయన గుర్తించాలని హితవుపలికారు. రావెల ఒక మానసిక రోగిలా వ్యవహరిస్తూ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాపు ఉద్యమంపై మాట్లాడే హక్కులేదు
కాపు ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రావెలకు ఏమాత్రం లేదన్నారు. రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టని రావెల దళిత జాతి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న జగన్‌పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.