తెలంగాణలో అత్యధిక జనాభా కల్గిన మున్నూరు కాపుల సంక్షేమం కోసం మున్నూరుకాపు భవన్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌సిటీ: తెలంగాణలో అత్యధిక జనాభా కల్గిన మున్నూరు కాపుల సంక్షేమం కోసం మున్నూరుకాపు భవన్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మున్నూరుకాపు మెడికల్ అండ్ హెల్త్ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేదలకు ప్రతి ఆదివారం ఉచిత వైద్యసేవలు అందించడానికి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మున్నూరుకాపు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కుల సంఘం ప్రతినిధులు జనార్దన్‌రావును అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గంప చంద్రమోహన్, ప్రొ.వెంకట్‌రావు, చామకూర ప్రదీప్, హజారి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.