'కాపులను విస్మరిస్తున్న టీడీపీ' | TDP ignoring kapu's | Sakshi
Sakshi News home page

'కాపులను విస్మరిస్తున్న టీడీపీ'

Published Sun, Oct 25 2015 8:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

TDP ignoring kapu's

కర్నూలు: తెలుగుదేశం పార్టీ కాపులను విస్మరిస్తోందని కాపునాడు జాతీయ కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని, వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చలేదన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో కాపు కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, సినీహీరో పవన్‌కల్యాణ్‌ను వేదికపైకి పిలువకుండా అవమానించారని వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన హామీలను వచ్చే డిసెంబర్ నాటికి నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు రమేశ్ నాయుడు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement