ignoring
-
ఐటీ నోటీసులను లైట్ తీసుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి..
పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు పాల్పడకుండా ఆదాయపు పన్ను శాఖ నూతన మార్గదర్శకాలతో పట్టు బిగించింది. ఐటీ శాఖ పంపించే నోటీసులను లైట్ తీసుకునేవారి పట్ల కఠిన వైఖరి అవలంభించనుంది. నోటీసులకు స్పందించనివారు పూర్తి స్క్రూటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను ఎగవేత చర్యలను కట్టడి చేయడంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త చర్యలను చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ నోటీసులకు స్పందించని పక్షంలో ఐటీ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు కూడా లోతుగా పరిశీలించనున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయంలో వ్యత్యాసాలను గుర్తించిన ఐటీ అధికారులు జూన్ 30లోగా ఐటీ చట్టం సెక్షన్ 143(2) కింద రెండో నోటీసు పంపుతారు. అలాగే సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు అందుకున్న వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఐటీ శాఖ పరిశీలిస్తుంది. స్క్రూటినీకి మార్గదర్శకాలు ఐటీ శాఖ పరిశీలనకు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ సీబీడీటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏవైనా చట్టబద్ధమైన సంస్థల నుంచి పన్ను ఎగవేతను సూచించే నిర్దిష్ట సమాచారం అందిన సందర్భంలో ఆ కేసులను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది. ఆ పన్ను చెల్లింపుదారు సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌కు ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నోటీసుకు స్పందనగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, సెక్షన్ 148 కింద నోటీసులు అందుకున్న సందర్భంలోనూ ఐటీ శాఖ పరిశీలన చేపడుతుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 142 (1) కింద నోటీసుపై రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తుంది. రిటర్న్ దాఖలుకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ ఈ సెక్షన్ 142(1) కింద నోటీసు జారీ చేస్తుంది. 2021 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత ఐటీ శాఖ సోదాలు చేసి సీజ్ చేసి ఉంటే అటువంటి వారు కూడా స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 1023(C) మొదలైన వాటి కింద ఐటీ శాఖ ఆమోదించకపోయినా పన్ను మినహాయింపు లేదా తగ్గింపును క్లెయిమ్ చేసిన వారిపై కూడా విచారణ ఉంటుంది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
కనగల్ : పాలక ప్ర భుత్వం రైతులను పట్టించుకోకుండా వివక్ష చూపుతోం దని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివా రం కనగల్ మండలంలోని దర్వేశిపురం కృష్ణా పుష్కరఘాట్‌లో ఆయన పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వమంటే పండుగలు చేయడమే కాదని అన్ని రంగాల్లో ప్రగతి సాధించే విధంగా పాలన ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధికారంలోకి రాగానే మాటమార్చారన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు అడిగారని ప్రభుత్వం రోజుకు 9 గంటల కరెంటు ఇస్తోందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు సంపత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, భిక్షంయాదవ్, వెంకట్‌రెడ్డి, రాజురెడ్డి, వెంకన్న, వెంకటేశం తదితరులు ఉన్నారు. -
'కాపులను విస్మరిస్తున్న టీడీపీ'
కర్నూలు: తెలుగుదేశం పార్టీ కాపులను విస్మరిస్తోందని కాపునాడు జాతీయ కన్వీనర్ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని, వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా హామీలను నెరవేర్చలేదన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో కాపు కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, సినీహీరో పవన్‌కల్యాణ్‌ను వేదికపైకి పిలువకుండా అవమానించారని వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన హామీలను వచ్చే డిసెంబర్ నాటికి నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు రమేశ్ నాయుడు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలను విస్మరించిన ప్రభుత్వం
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పెనుకొండ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనార్టీలను విస్మరించిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ ఆరోపించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లీం కోసం 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత తెలుగుదేశం హయాంలో రిజర్వేషన్ల అమలు కాకపోయినా మైనార్టీలు ఉన్నారన్న విషయాన్ని గుర్తిస్తే చాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన డీలర్లను బలవంతంగా తొలగించి తెలుగుదేశం వారికి కట్టబెట్టారని, ఇదెక్కడి న్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న కాంట్రాక్ట్ పనులను బలవంతంగా నిలుపుదల చేయించి టీడీపీవారికి కట్టబెట్టాలన్న ఒత్తిడి అధికారులపై అధికమైందన్నారు. దీంతో అధికారులు విధులు నిర్వర్తించాంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే బీకే. పార్థసారథి కనుసన్నల్లో ఈ వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. త్వరలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై కాంగ్రెస్ తగిన విధంగా స్పందిస్తుందన్నారు. నాయకులు చినవెంకటరాముడు, కేటీ.శ్రీధర్, మహేష్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, సుగుణాకరరెడ్డి, నారాయణస్వామి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ నాయకులతో పడుతున్న ఇబ్బందులను పీసీసీ ఛీఫ్‌కు వివరించారు. బాబయ్య సమాధిని దర్శించుకున్న రఘువీరారెడ్డి : ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీఖాన్ మంగళవారం స్థానిక బాబయ్య దర్గాను సందర్శించి స్వామివారి సమాధిని దర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వారు పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రికి దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మతపెద్దలతో మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట నాయకులు కేటీ శ్రీధర్, చినవెంకటరాముడు, సుదర్శనరెడ్డి ఉన్నారు. -
రోజులు గడుస్తున్నా కేసును పట్టించుకోని పోలిసులు