రైతులను పట్టించుకోని ప్రభుత్వం
Published Mon, Aug 22 2016 12:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
కనగల్ : పాలక ప్ర భుత్వం రైతులను పట్టించుకోకుండా వివక్ష చూపుతోం దని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆదివా రం కనగల్ మండలంలోని దర్వేశిపురం కృష్ణా పుష్కరఘాట్‌లో ఆయన పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వమంటే పండుగలు చేయడమే కాదని అన్ని రంగాల్లో ప్రగతి సాధించే విధంగా పాలన ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధికారంలోకి రాగానే మాటమార్చారన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు అడిగారని ప్రభుత్వం రోజుకు 9 గంటల కరెంటు ఇస్తోందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు సంపత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, భిక్షంయాదవ్, వెంకట్‌రెడ్డి, రాజురెడ్డి, వెంకన్న, వెంకటేశం తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement