మురళీనగర్: కాపు విద్యార్థులకు(ఓసీ) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామని టైమ్ కోఆర్డినేటర్ మేడిది రాజశేఖర్ చెప్పారు. కాపు వెల్ఫేర్ కార్పొరేషన్‌తో ఒప్పందం మేరకు ఈ శిక్షణ తరగతులు మూడు నెలలపాటు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఇందులో ఎస్‌ఎస్‌సి, బ్యాంకు, జీఆర్‌ఈ, గేట్, ఆర్‌ఆర్‌బీ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణనివ్వడమే కాకుండా మెటీరియల్ కూడా సరఫరా చేస్తామన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన యువతీ యువకులు (18–30 ఏళ్లలోపు వయసు) దరఖాస్తు చేసుకోవాలన్నారు. నగరంలోని ఎన్‌ఏడీ, గాజువాక, రాజేంద్రనగర్, మధురవాడలోని టైమ్ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని సూచించారు. వీరు కులం ధ్రువీకరణ (ఓసీ), పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమోతోపాటు ఇతర సర్టిఫికెట్లు, మూడు ఫొటోలు, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలను సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వివరాలకు 9246670639 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు. వీరికి శిక్షణతోపాటు ఉపకార వేతనం కూడా ఇస్తారని చెప్పారు.
కాపు విద్యార్థులకు టైం ఉచిత శిక్షణ
Published Tue, Aug 16 2016 12:19 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement
Advertisement