‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’ | TDP Mla Krishnaiah comments on Kapu reservation issue | Sakshi
Sakshi News home page

‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’

Published Thu, Aug 17 2017 12:41 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’ - Sakshi

‘కాపులను బీసీల్లో చేర్చితే యుద్ధమే’

సాక్షి, హైదరాబాద్‌: కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ శాసనసభ్యులు ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ చర్యతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బుధవారం బీసీ భవన్‌లో జరిగిన బీసీ సంఘాల కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీలో కాపులను బీసీల్లో చేర్చుతామని, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఆచరణలో అమలు కాదన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, లబ్ధికోసం రిజర్వేషన్లు నిర్ణయించవద్దని, అలాచేస్తే బీసీ కులాలన్నీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాయన్నారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు ర్యాగ అరుణ్, సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement