'పోలీసులే రెచ్చగొట్టారు'
తుని: పోలీసుల వల్లే తమ కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. రాస్తారోకో చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని చెప్పారు. తర్వాత తమపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారని తెలిపారు. ఈ కవ్వింపు చర్యల వల్లే చాలా మంది రెచ్చిపోయారని ఆందోళనకారులు వెల్లడించారు.
తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై ఆందోళన కారులు దాడి చేశారు. స్టేషన్ ప్రాంగణంలో 8 వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు కాపుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో తునికి అదనంగా పోలీసు బలగాలు తరలిస్తున్నారు. ఆందోళనకారులు భారీ సంఖ్యలో బైఠాయించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవరించారని డీజీపీ జేవీ రాముడు తెలిపారు.